గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 20 జూన్ 2019 (15:19 IST)

ప్రధానిని ఆ విషయంలో ప్రశ్నించిన హాట్ యాంకర్ రష్మి... ఎందుకు..?

సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ చురుగ్గా ఉంటోంది. సమాజంలో జరుగుతున్న వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలను సంధిస్తోంది. గతంలో కూడా రష్మిగౌతమ్ కొన్ని విషయాలపై తీవ్రంగానే స్పందించింది. తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్‌లో జరిగిన చిన్నారిపై అత్యాచారం, హత్య పై ఘాటుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించింది.
 
నరేంద్రమోడీ గారు.. మీరేమో భేటీ బచావో. భేటీ పడావో అంటారు. అమ్మాయిలను చదివించండి.. అమ్మాయిలను కాపాడండి అంటున్నారు. కానీ అమ్మాయిలు ఎక్కడున్నారు. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఇక అమ్మాయిలు ఎక్కడ మిగులుతారు. ఈ భేటీ బచావో.. భేటీ పఢావో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది యాంకర్ రష్మి.