శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (15:29 IST)

ఆ పాడు పని చేసింది యాంకర్ ప్రశాంతి.. కేసు నమోదు

ఐపీఎల్ టోర్నీలో భాగంగా, ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సమయంలో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు తప్పతాగి హల్‌చల్ సృష్టించారు. ముఖ్యంగా, ఓ అమ్మాయి పీకల వరకు మద్యం సేవించి నానాయాగీ చేసింది. ఓ వీక్షకుడితో అసభ్యంగా ప్రవర్తించింది. అతన్ని వెనుక వైపు నుంచి వాటేసుకుంది. కొద్దిసేపు అతని వీపుపైనే ఉండిపోయింది. అలా హల్‌చల్ సృష్టించింది. దీనిపై కొందరు వీక్షకులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో తప్పతాగి స్టేడియంలోకి రావడమేకాకుండా నానా యాగీ చేసింది పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌, యాంకర్ ప్రశాంతిలుగా గుర్తించారు. వీరు తోటి వీక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. మ్యాచ్ చూడకుండా సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో ప్రశాంతి అసభ్యంగా ప్రవర్తించింది. 
 
దీంతో ఆగ్రహానికి లోనైన ఓ వీక్షకుడు ప్రశాంతితో పాటు ఆమె స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసు అధికారులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరణ ఇవ్వనుంది.