రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్

steve smith
Last Updated: ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (17:35 IST)
రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చిన అజింక్యా రహానేను తప్పించి స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

శనివారం ముంబైతో మ్యాచ్‌కు గంట ముందు రహానే స్థానంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు జట్టు పగ్గాలప్పగిస్తున్నట్టు మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని జట్టు మేనేజ్‌మెంట్ కేవలం కొన్ని గంటల వ్యవధిలో తీసుకుంది. స్టీవ్ స్మిత్ వచ్చే నెల ఒకటో తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాడు.

బాల్‌ టాంపరింగ్‌ స్కామ్‌లో ఒక యేడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న స్మిత్‌.. గతంలోనూ రాజస్థాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఐపీఎల్‌లో రహానే కెప్టెన్సీ ఆడిన 8 మ్యాచ్‌ల్లో రాయల్స్‌ రెండు మాత్రమే నెగ్గింది. ఇక, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో కనీసం ఐదు నెగ్గితేనే వారి ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.దీనిపై మరింత చదవండి :