మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (10:32 IST)

మిస్టర్ కూల్‌కు కోపమొచ్చింది.. ధోనీపై 50శాతం మ్యాచ్ ఫీజు కోత..

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై 50 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించారు. ధోనీ ఐపీఎల్ కోడ్‌ను ఉల్లంఘించారు. అవును మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకుని ఎప్పుడూ ప్రశాంతంగా వుండే ధోనీకి ఈ సారి కోపం వచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన లెవల్ 2 నేరం చేశాడు. 
 
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను స్టోక్స్ వేస్తూ, శాంటనర్‌కు ఫుల్ టాస్ బాల్ వేశాడు. ఈ బాల్ గాల్లోకి లేచి, ఆరు పరుగులు తెచ్చింది. ఇదే బాల్‌ను తొలుత నోబాల్‌గా ప్రకటించిన అంపైర్లు, దాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇదే ధోనీ ఆగ్రహానికి కారణమైంది. 
 
ఫీల్డ్ అంపైర్ ఉల్లాస్ ఘాండే దీన్ని నోబల్ అని పేర్కొనగా, స్క్వేర్ లెగ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ దాన్ని నోబాల్ కాదని తేల్చారు. దీంతో దీంతో అప్పటికే పెవిలియన్ చేరిన ధోనీ, తిరిగి మైదానంలోకి వచ్చి గొడవకు దిగాడు. 
 
మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకుని, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ధోనీకి కోపం వచ్చింది. కానీ దీన్ని ఐపీఎల్ నిబంధనల ప్రకారం 2వ స్థాయి నేరంగా పరిగణిస్తూ, మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాను నిర్వాహకులు విధించారు.