శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (16:14 IST)

ధోనీ ఎక్కడున్నా కింగే.. జైపూర్‌ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టాడో లేదో?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీకి దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఐపీఎల్‌లో చెన్నైలోనే కాదు.. జైపూర్‌లోనూ ధోనీ కింగ్ అనిపించుకుంటున్నాడు. ఎక్కడికెళ్లినా ధోనీ ధోనీ అనే పేరు మారుమ్రోగిపోతోంది. చేపాక్ మైదానంలో కోల్‌కతా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుపును నమోదు చేసుకుంది. దీంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ధోనీ జట్టు అగ్రస్థానం వైపు ముందడుగు వేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం జైపూర్‌లో చెన్నై మ్యాచ్ ఆడనుంది. రాజస్థాన్ రాయవ్స్ జట్టుతో ధోనీ సేన బరిలోకి దిగనుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ధోనీతో పాటు జట్టు సభ్యులు జైపూర్‌కు చేరుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ధోనీ కాలుపెట్టగానే.. ధోనీ.. ధోనీ.. అంటూ ఫ్యాన్స్ అంటూ అభిమానం వెల్లడించారు. ధోనీ పేరును అభిమానులు పలకడంతో ఎయిర్‌పోర్ట్ దద్దరిల్లింది. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.