హెయిర్ స్టయిలిస్ట్‌గా మారిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు..

మోహన్| Last Updated: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:57 IST)
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ డ్వెయిన్ బ్రావో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిన విషయమే. అతనికి పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం సరదా. మైదానంలో ఉన్నా సరే, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నా సరే అతను ఎప్పుడూ అందరినీ ఎంటర్టెయిన్ చేస్తూనే ఉంటాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ బ్రావో ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాడు. 
 
తన టీమ్‌మేట్స్‌కు హెయిర్‌ స్టయిలిస్ట్‌గా మారాడు. చెన్నై టీమ్‌ ప్లేయర్‌ మోనూ సింగ్‌కు బ్రావో హెయిర్‌ స్టయిలిస్ట్‌గా మారాడు. ట్రిమ్మర్‌తో మోనూ సింగ్‌ తలవెంట్రుకలు కట్‌ చేశాడు. ఇవాళ చెన్నై, కోల్‌కత్తా మధ్య మ్యాచ్‌ జరగనుంది.దీనిపై మరింత చదవండి :