సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (16:09 IST)

రసెల్ సిక్సర్‌ను జడేజా ఒంటి చేత్తో అలా అడ్డుకున్నాడు..వీడియో వైరల్

చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోని కొన్ని షాట్లు సోషల్ మీడియాలో వైరలై కూర్చున్నాయి. ఇందులో భాగంగా రసెల్ కొట్టిన సిక్సర్‌ను జడేజా ఒక్క చేతిలో అడ్డుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. 
 
మంగళవారం చేపాక్ మైదానంలో జరిగిన ఈ పోటీలో టాస్ గెలిచిన కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీని ప్రకారం బ్యాటింగ్ దిగిన కోల్‌కతా ఓపెనర్లు లిన్, సునీల్ నరైన్ వెంట వెంటనే అవుట్ అయ్యారు. చెన్నై కింగ్స్ బౌలర్ల ధాటికి కేకేఆర్ బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ క్యూ కట్టారు. 
 
కేకేఆర్ జట్టులో అత్యధికంగా రసెల్ మాత్రం 50 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో రసెల్ కొట్టిన బంతి సిక్సర్‌ కాకుండా జడేజా అడ్డుకుని బౌండరీ లైన్‌లో ఒక చేతితో అడ్డుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. జడేజాపై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 17.2 ఓవర్లకో 3 వికెట్ల పతనానికి 111 పరుగులు సాధించి.. గెలుపును నమోదు చేసుకుంది.