రెయిన్‌బో నది: ప్రపంచంలో ఇంత అందమైన నది మరొకటి లేదు..

మోహన్| Last Updated: బుధవారం, 10 ఏప్రియల్ 2019 (15:51 IST)
దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియా దేశంలో ఉన్న ఈ నదిని ఖనిజాల గని అని పిలుస్తారు. ఈ నది రంగును చూసి పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతుంటారు. ఆ ప్రాంతంలో మకరేనియా క్లేవిగెరా అనే నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. వీటి వల్లే ఆ నది రంగు అలా ఉంటుందని స్థానికంగా ఉండే టూరిస్ట్ గైడ్ ఒకరు అంటున్నారు. వివిధ రంగుల్లో పర్యాటకులకు కనువిందు చేస్తున్న ఈ నది పేరు 'కనో క్రిస్టాలీస్'. 'రెయిన్‌బో రివర్' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. దీనినే 'షీల్డ్ ఆఫ్ గయానా'గా అభివర్ణిస్తారు. 
 
ఈ నది రంగు గురించి అనేక వాదనలు ఉన్నాయి. రాళ్లలో ఖనిజాలు ఉండడం వల్ల ఆ రంగు వచ్చిందని కొందరు అంటారు. అంతేకాకుండా ఖనిజాలతో పాటు రాళ్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగలేవని చెబుతున్నారు. ఈ మొక్కలు ఏడాదికి కేవలం ఒక సెంటీమీటర్ మాత్రమే పెరుగుతాయి. భూమిలోని ఖనిజాలకు అనుగుణంగా ఈ పూల రంగు ఉంటుంది.
 
అమెజాన్ అడవి, ఆండియన్ పర్వత శ్రేణులు, ఒరినోకియా మైదాన ప్రాంతం ఇక్కడే కలిసి ఉన్నాయి. నీటి మొక్కలు పెరిగే ఈ ప్రాంతంలో వేర్వేరు జోన్‌లు ఉన్నాయి. గతంలో ఈ నదిని ప్రమాదకరమైన ప్రాంతంగా భావించేవారు. ప్రస్తుతానికి మాత్రం దీనిని మరింత అభివృద్ధి చేసి, గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే బాగుంటుందని పర్యాటకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :