శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By

సగం మనిషి.. సగం కుక్క.. అందుకే దాడి చేసి కుక్కలా కరుస్తున్నాడు..

ఫ్లోరిడాలో ఓ వ్యక్తి సగం కుక్కలా, సగం మనిషిలా ప్రవర్తిస్తున్నాడు. అందుకే ఇరుగుపొరుగువారిపై దాడి చేసి కుక్కలా కొరుకుతున్నాడు. దీంతో అతన్ని మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చాలని వైద్యులు సలహా ఇచ్చారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల ఓ వ్యక్తి వింతగా ప్రవర్తిస్తూ ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా వారిలో ఒకరిని కుక్క కరిచినట్టుగా కరిచేశాడు. ముఖంపై చాలా చోట్ల అతడిని కొరికేశాడు. 
 
దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని అరెస్టు చేశారు. అతన్ని హర్‌ఆఫ్(22)గా గుర్తించారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన మానసిక వైద్యులు కొన్ని నెలలపాటు వైద్యులు హర్‌ఆఫ్‌ను పరీక్షించారు. అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు తేల్చారు. 
 
తనను తాను సగం మనిషి, సగం కుక్క అని అతడు భావిస్తున్నాడని వైద్యులు చెబుతున్నారు. అటువంటి లక్షణాల వల్లే అతడు తన పక్కింటి వారిపై దాడి చేసి కుక్కలా కొరికాడని వైద్యులు తెలిపారు. హర్‌ఆఫ్ గతంలో ఓ యూనివర్సిటీలో చదువుకున్నాడని అప్పట్లో అతడిలో ఇలాంటి లక్షణాలేవి కనిపించలేదని అతడి స్నేహితులు తెలిపారు. మానసిక ఆందోళన వల్లే అతడు ఇలా మారిపోయాడని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.