సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శనివారం, 30 మార్చి 2019 (16:24 IST)

ఎలాగూ రాత్రయితే కుక్కపిల్లలా తోకూపుకుంటూ వస్తాడుగా... అప్పుడు చూస్తా...

నా భర్త తరచూ నాతో గొడవపడుతుంటాడు. కానీ శృంగార విషయం దగ్గరకి వచ్చేసరికి కాళ్లు పట్టుకుంటాడు. బ్రతిమలాడి కోర్కె తీర్చుకున్న తర్వాత హాయిగా రాత్రంతా నిద్రపోతాడు. ఉదయం లేవగానే మళ్లీ టార్చర్ మొదలుపెడతాడు. 

ప్రవర్తన మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదు. ఎలాగూ రాత్రయితే కుక్కపిల్లలా తోకూపుకుంటూ వస్తాడు కనుక శృంగారానికి సహకరించకుండా, నా మాట వినేవరకూ చేద్దామనుకుంటున్నా. ఐతే ఇది నేను కావాలని చేయడంలేదు. నాక్కూడా రాత్రయితే శృంగారంలో పాల్గొనాలనే వుంటుంది. కానీ అదిమిపెట్టక తప్పడంలేదు. నేను చేస్తుంది కరెక్టే కదూ...
 
అసలు ఆయన మీతో ఏ విషయాల్లో గొడవపడుతున్నారో వివరించలేదు. ప్రత్యేకించి కొన్ని పనులు కొందరికి నచ్చవు. అవి చేస్తుంటే ఖచ్చితంగా గొడవలు రావడం సహజం. ఆయన ఏం వద్దంటున్నారో అవి చేయకుండా కాస్త ఓర్పు వహించండి. ఐతే మీరు అనుసరించాలనుకుంటున్న మార్గం మీరు అనుకున్నంత మంచిది మాత్రం కాదు.
 
పెళ్లయ్యాక శరీరం భార్యాభర్తలు శృంగారం అనుభవం కావాలని తహతహలాడుతుంటారు. దానిని బలవంతంగా అదిమిపెడితే మనసు అదుపుతప్పి డిప్రెషన్లోకి వెళుతుంది. లేదంటే కొత్త సంబంధాలను వెతుక్కుంటూ విచ్చలవిడి ప్రవర్తనగా మారుతుంది. శరీరం అదుపుతప్పినప్పుడు ఇది జరుగుతుంది. కోర్కెలను బిగబట్టుకుని కూచుంటే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. 
 
శృంగారం నిరోధించే విషయం చాలా కష్టం. ఎందుకంటే శృంగారం కాదనలేనిది. ఇందులోని ఆనందం, తృప్తి శరీరం అనుభవించి తీరాల్సిందే. అందుకే ఏ వయసుకు ఆ ముచ్చట అని మన పెద్దలు చెప్పేశారు. కాబట్టి సమస్యను పరిష్కరించుకునేందుకు శృంగారాన్ని ఆయుధంగా చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచించుకోండి.