శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:52 IST)

పెంపుడు కుక్కకు ప్రాధాన్యమిచ్చిన భార్య : శునకంలా మారిన భర్త

ఒక భార్య తన భర్త కంటే తమ ఇంటి పెంపుకు కుక్కకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో మనస్తాపానిగురైన భర్త ఏకంగా శునకంగా మారిపోయాడు. తనను తాను శునకంలా ఊహించుకున్నాడు. చివరకు శునకంలా మారిపోయాడు. ఇప్పడు అతను మనిషి కాదు.. అలాగని జంతువు కూడా కాదు. శునకంలా ప్రవర్తించే మనిషి. ఇది అమెరికాలో నివసించే ఓ వ్యక్తి వ్యథ.
 
ఫ్లోరిడాలోని ఓ వ్యక్తి, రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు యువకులపై దాడి చేశాడు. కుక్కలా కరిచి, కండ పీకేసాడు. అతని ప్రవర్తనకు స్థానికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా, యువకులపై దాడి చేసింది 22 ఏళ్ల హార్‌ఆఫ్‌గా గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే అతని ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. 
 
పరీక్షించిన వైద్యులు హార్‌ఆఫ్‌ ఒక వింత జబ్బుతో భాదపడుతున్నాడని గ్రహించారు. అందుకే అతను శునకంలాగా ప్రవర్తిస్తున్నాడని తేల్చేసారు. కాలు ఎత్తి, గోడల మీద టాయిలెట్ చేయడం.. కొత్తవారు కనిపిస్తే మొరగడం.. అనుమానం వస్తే దాడి చేయడం.. వంటివి తన మానసిక రుగ్మతలోని భాగమేనన్నారు.
 
జాబ్‌లో మానసిక ఒత్తిడికి లోనవ్వడం, అతని భార్య తనకంటే తన పెంపుడు శునకంతోనే ఎక్కువ సమయం గడపడం, తనను ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం కూడా హార్ఆఫ్‌ వింత ప్రవర్తనకు ఓ కారణమని సైకాలజిస్టులు అనుమానిస్తున్నారు.