సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (18:28 IST)

వీర్యదానం చేసి కేసులో ఇరుక్కున్న డాక్టర్.. ఎక్కడ?

సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఆశ్రయించిన వారికి వీర్యదానం చేసి కేసులో ఇరుక్కున్నాడో డాక్టర్. 50 మంది వచ్చి నాన్నా అని పిలిస్తే సంతోషించాలో లేక కేసులో చిక్కుకున్నందుకు బాధపడాలో తెలియక అయోమయ స్థితిలో పడ్డాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.


అమెరికాలోని ఇండియానాలో ఉండే ఓ ఫెర్టిలిటీ ఆసుపత్రిలో డాక్టర్ డొనాల్డ్ క్లైన్ సంతానలేమితో తన దగ్గరకు వచ్చిన ఆడవాళ్లకు వీర్యదానం చేసి సంతానోత్పత్తి చేశాడు. 
 
ఆ విషయం గ్రహీతలకు కూడా తెలియదు. దాదాపు 50 మంది మహిళలకు వీర్యదానం చేసి మాతృత్వాన్ని ప్రసాదించాడా వైద్యుడు. ఇది జరిగి సుమారు 40 సంవత్సరాలు కావస్తోంది. 1960, 70లలో వీర్యదానం ద్వారా ఉత్పత్తి అయిన పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. దశాబ్దాలు గడిచిపోయాయి. 
 
ఈ మధ్య అమెరికాలో కొన్ని డీఎన్ఏ వెబ్‌సైట్‌ల ద్వారా ఒకే డీఎన్‌ఏ కలిగిన వారందరూ ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. 50 మందికి ఒకే డీఎన్‌ఏ ఎలా ఉందని విచారణ చేయగా తండ్రి ఒక్కడే అని తేలింది. తల్లుల డీఎన్‌ఏ మాత్రం మ్యాచ్ కాలేదు. అలా 50 మంది తమ పుట్టుకకు కారణమైన సెర్మ్ డోనర్ డొనాల్డ్ క్లైన్‌ను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అతడిని వెళ్లి కలిశారు కూడా. వారిని చూసి డాక్టర్ సంతోషించే లోపే అతనిపై కేసులు నమోదయ్యాయి. విర్యదానం చేసింది స్వయంగా డాక్టర్ అని తెలిసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
ఎవరో ఇతర వ్యక్తి దగ్గర నుండి వీర్యం సేకరించి సంతానోత్పత్తి చేసాడని అనుకున్నామని, తానే ఇలా చేస్తాడని ఊహించలేకపోయామని వాపోయారు. దీని కారణంగా డాక్టర్‌కి ఏడాది జైలు శిక్ష విధించారు. తెలిసింది 50 మందే అయినప్పటికీ, ఇతని సంతానం ఇంకా ఎంత మంది ఉంటారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.