9 నిమిషాల్లో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ

us woman
Last Updated: ఆదివారం, 17 మార్చి 2019 (09:59 IST)
సాధారణంగా ఒక ప్రసవంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుడుతుంటారు. కానీ, అమెరికాకు చెందిన ఓ ఏకంగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అదీకూడా కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే. ఇలా జరగడం అద్భుతమని వైద్యులు చెపుతున్నారు. ముఖ్యంగా, ఇలాంటి మహిళ 470 కోట్ల మంది మహిళల్లో ఒకరు ఉంటారని తెలిపారు.

ఈ వివరాలను పరిశీలిస్తే, యూఎస్‌లోని టెక్సాస్‌లో ఉన్న మహిళల ప్రసూతి ఆస్పత్రిలో ఓ మహిళ ప్రసవం కోసం చేరింది. ఈ మహిళకు కొందరు వైద్యులు దగ్గరుండి కాన్పు చేశారు. ఈ కాన్పులో ఆమెకు ఏకంగా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో నలుగురు బాబులు, ఇద్దరు పాపలు ఉన్నారు. ఈ డెలివరీని సెక్స్‌టప్లెట్స్ అని అంటారట. సెక్స్‌టప్లెట్ అంటే ఒకే డెలివరీలో ఆరుగురు పిల్లలకు జన్మనివ్వడం.

ముందుగా ఇద్దరు మగ పిల్లలు, ఆ తర్వాత మరో ఇద్దరు మగ పిల్లలు, ఆ తర్వాత ఇద్దరు ఆడబిడ్డలకు ఆ మహిళ జన్మనిచ్చిందట. ప్రస్తుతం ఆరుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఉదయం 4.50 నుంచి 4.59 వరకు కేవలం 9 నిమిషాల్లో ఆరుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి తెల్మా చియాక ఆరోగ్యం కూడా బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పిల్లలంతా.. 790 గ్రాముల నుంచి 1.3 కిలోల బరువుతో జన్మించారట. వాళ్లను ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి అబ్సర్వేషన్‌లో పెట్టారు.దీనిపై మరింత చదవండి :