శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (11:13 IST)

సచిన్ సవాల్‌పై చమత్కరించిన మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్

మార్చి 14వ తేదీన పుట్టినరోజు జరుపుకున్న 'మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్' బర్త్‌‌డే బాయ్ అమీర్‌ ఖాన్‌కు విషెస్ చెబుతూ క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు అమీర్ తనదైనశైలిలో చమత్కారమైన రిప్లై ఇచ్చారు. ఈ ఆసక్తికర సన్నివేశం ట్విట్టర్‌లో చోటుచేసుకుంది.
 
1965వ సంవత్సరం మార్చి 14న అమీర్ జన్మించారు. నేటికి ఆయన వయస్సు 54 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా అమీర్‌కు పలువురు సెలెబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా అమీర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే శుభాకాంక్షలు చెప్తూనే అమీర్‌కు ఓ ఛాలెంజ్ విసిరారు మాస్టర్.
 
అమీర్‌తో తీసుకున్న ఒక ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సచిన్ ‘‘నా అత్యంత సన్నిహిత మిత్రుడు అమీర్ ఖాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అని రాసుకొచ్చారు. అయితే దీనితో పాటు ‘ఏ’ అనే అక్షరానికి నువ్వేమంటావు? అని అమీర్‌కు సవాల్ విసిరారు. దీనికి తనదైనశైలిలో స్పందించిన అమీర్.. సచిన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ‘కృతజ్ఞతలు సచిన్. ఆతా క్యా ఖండాలా?’ అని రాసుకొచ్చారు. చివరిలో లవ్, ఏ అని జోడించారు అమీర్.