సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By కుమార్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (18:09 IST)

ఎన్నితరాలు మారినా.. కొన్ని రికార్డులను చెరపలేరు.. అవేంటి? (video)

అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా మంది ఎన్నో రికార్డులు నెలకొల్పుతూ ఉంటారు. అలాగే ఆ రికార్డులను వేరొకరు అధిగమిస్తూ కూడా ఉంటారు. అయితే ఎన్ని ఏళ్లు గడిచినా, ఎన్ని తరాలు మారినా కూడా కొన్ని రికార్డులను ఇప్పటికీ ఎవరూ చెరపలేకపోవడం విశేషం. ఆ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం. 
 
* సచిన్ టెండూల్కర్ టెస్ట్, వన్డే మ్యాచులు రెండింటిలో కలిపి 34,357 పరుగులు చేశాడు. టెస్టుల్లో 15,921 పరుగులు చేయగా, వన్డే మ్యాచుల్లో 18,426 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఈ పరుగులకు దరిదాపుల్లో కూడా ఏ ఆటగాడూ లేడు. 
 
* శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్లు, వన్‌డేల్లో 534 వికెట్లు, టీ20లలో 13 వికెట్లు తీసి అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.
 
* వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా ఒకే ఇన్నింగ్స్‌లో మూడు రోజులపాటు ఆడి 400 పరుగులు చేసాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
* ఆస్ట్రేలియా 1999, 2003, 2007 సంవత్సరాల్లో వరుసగా ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఉండే జట్లు ఈ రికార్డును చేరుకోవడం కూడా కష్టంగా కనిపిస్తోంది.
 
* 1884లో ఇంగ్లండ్‌కు చెందిన వాల్టర్ రెడ్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పదో ఆటగాడిగా బరిలోకి దిగి సెంచరీ చేసాడు. ఈ రికార్డు సాధించి శతాబ్దంకి పైగా గడిచినా ఎవ్వరూ అధిగమించలేకపోవడం విశేషం.
 
* 1903లో ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియాకు జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేసిన 285 పరుగుల కంటే ఎక్కువగా ఇంగ్లండ్ అటగాడు రెజినాల్డ్ టిప్ 287 పరుగులు చేసాడు. ఇది ఇప్పటికీ అసాధ్యమేనదే.
 
* 1954లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జిమ్ లేకర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 19 వికెట్లు సాధించాడు. ఇది కూడా ఇప్పటికీ ఎవరూ చేరుకోలేని రికార్డు.