శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 5 మార్చి 2019 (19:28 IST)

చంద్రలేఖ కన్నుమూత...

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అవిశేష్ దాల్మియా మాతృమూర్తి శ్రీమతి చంద్రలేఖ కన్నుమూశారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. ఈమె బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, స్వర్గీయ జగ్‌మోహన్ దాల్మియా సతీమణి.
 
గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఐతే మూడు నెలలుగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స కోసం మూడు ఆస్పత్రులలో చేర్పించి అందించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.