ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:58 IST)

అప్పుడు నాగార్జునతో చంద్రలేఖలో.. ఇప్పుడు కేజీఎఫ్‌-2లో.. ఎవరు?

''కేజీఎఫ్'' తొలి భాగానికి మంచి గుర్తింపు, క్రేజ్ రావడంతో రెండో పార్ట్‌ను మరింక పకడ్బందీగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడు. అందుకే కేజీఎఫ్ సీక్వెల్‌లో పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకునే పనిలో వున్నాడు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. 
 
కన్నడలో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నీ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన రెండు నెలల్లోనే అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇప్పటికీ  ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డుతో కలెక్షన్లతో కుమ్మేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు రెండో భాగం రానుంది. ఇందులో సంజయ్ దత్ నటించనున్నారు. గతంలో సంజయ్ దత్.. నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖలో నటించారు. ప్రస్తుతం 21 ఏళ్ల తర్వాత సంజయ్ దత్ మళ్లీ దక్షిణాది సినిమాలో కనిపించనున్నారు.