సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (11:30 IST)

అవునండి.. ఆ రోజు జరిగింది తప్పే.. క్షమించండి.. యాంకర్ రవి

యాంకర్ రవి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వుంటాడు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆపై సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్తుండటం చేసి వున్నాడు. ప్రస్తుతం ఓ టీవీ షోలో ఏపీ ప్రజలను కించపరిచే విధంగా ఓ కంటెస్టెంట్ వ్యాఖ్యలు చేయడం... దానికి యాంకర్ రవి సపోర్ట్ చేసినట్టుగా కామెంట్స్ చేయడంతో వివాదం మొదలైంది.
 
అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు యాంకర్ రవిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడితే ఖండించాల్సింది పోయి వారికి మద్దతు పలుకుతావా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 
వివాదం ముదరడంతో యాంకర్ రవి ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్తూ వీడియో విడుదల చేశాడు. ఆరోజు జరిగింది ముమ్మాటికీ తప్పేనని, దేశాన్ని గౌరవిస్తానని.. తెలుగు రాష్ట్రాలను కూడా ప్రేమిస్తానని చెప్పాడు. 
 
ఇంకా యాంకర్‌గా తన స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారని వివరణ ఇచ్చాడు. తనకు ఏపీ ప్రజలు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే ఎంతో అభిమానమని చెప్పుకొచ్చాడు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని నెటిజన్లను కోరాడు.