'యురి' సర్జికల్ స్ట్రైక్స్‌తో డబుల్ సెంచరీ .. రూ.225 కోట్ల దిశగా పరుగులు

uri movie still
Last Updated: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (12:42 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైన్యం మెరుపు దాడి (సర్జికల్ స్ట్రైక్స్) నిర్వహించి అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం "యురి". ఈ చిత్రం సంక్రాంతి పండుగ సమయంలో అంటే జనవరి 11వ తేదీన విడుదలైంది.

ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. గత నాలుగు వారాల్లో ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం విడుదలైన 28 రోజుల్లో రూ.200.07 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రం రూ.225 కోట్ల దిశగా పరుగులు తీస్తోందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

ఈ చిత్రం గత సోమవారం రూ.2.86 కోట్లు, మంగళవారం రూ.2.63 కోట్లు, బుధవారం రూ.2.40 కోట్లు, గురువారం రూ.2.19 కోట్లు, శుక్రవారం రూ.3.44 కోట్లు, శనివారం రూ.6.62 కోట్లు, ఆదివారం రూ.8.88 కోట్లు చొప్పున మొత్తం రూ.200.07 కోట్లను వసూలు చేసింది.దీనిపై మరింత చదవండి :