శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (16:37 IST)

కేసీఆర్ మంత్రివర్గం విస్తరణ : ఆ ఇద్దరితో సహా ఆరుగురికి ఛాన్స్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇందులో కొత్తగా ఆరుగురికి చోటుదక్కింది. వారిలో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
కొత్త మంత్రులతో తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత హరీశ్ రావుతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేటీఆర్‌తో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
 
ఆ పిమ్మట సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌‌లతో వరుసగా ఆమె మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
 
తమిళిసై సౌందర్‌రాజన్ తమిళనాడు రాష్ట్ర కొత్త గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త గవర్నర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. 
 
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన తండ్రి, గాంధేయవాది, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కుమరి అనంతన్‌కి గవర్నర్ తమిళిసై పాదాభివందనం చేశారు.
 
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి డిప్యూటి ఛైర్మన్ నేతి విద్యాసాగర్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్, ఎంపీ సంతోష్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు.