సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 28 ఆగస్టు 2019 (19:21 IST)

ఆ అవార్డ్ రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది: మ‌హేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్ సంస్థతో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబడిన మల్టీప్లెక్స్ ఏఎంబి సినిమాస్. గత ఏడాది డిసెంబర్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ మల్టిప్లెక్స్ నాణ్యత ప్రమాణాలపై ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పొగడ్తలు కురిపించారు. ఈ ఏడాది ప్రకటించిన ఐమాక్స్ బిగ్ సినీ అవార్డ్స్ 2019లో, బెస్ట్ మల్టిప్లెక్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఏఎంబి సినిమాస్ అవార్డును సొంతం చేసుకున్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది.
 
అయితే నేడు ఏఎంబి సినిమాస్ మానేజ్మెంట్ టీమ్ ఆ అవార్డును అందుకుంటున్న ఫోటోను మహేష్ తన సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తూ, ‘బెస్ట్ మల్టిప్లెక్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఏఎంబి సినిమాస్‌కు అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డు దక్కడానికి కారకులైన మల్టిప్లెక్స్ మానేజ్మెంట్ మరియు స్టాఫ్‌కు తన తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెల్పుతూ పోస్ట్ చేసారు మహేష్ బాబు.