సంబంధిత వార్తలు
- అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు.. ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరి.. సెలెబ్రిటీస్ ట్వీట్స్
- ''సరిలేరు నీకెవ్వరు'' కాంటెస్ట్.. ఇంతకీ ఏంటా కాంటెస్ట్..?
- అదిరే అందాలతో హైదరాబాద్‌లో అమెజాన్ భారీ క్యాంపస్ (వీడియో)
- అమెజాన్: "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - 'ఫేక్' అంబాసిడర్లపై ట్విటర్లో విమర్శలు
- మహేష్, బన్నీ ఫ్యాన్స్‌కి భయపడిన నిర్మాతలు... ఇంతకీ ఏం చేసారు..?
అందరూ ఆలోచించాల్సిన సమయం ఇదే - మహేష్ బాబు
ప్రపంచానికి ఆయువుపట్టులా నిలుస్తున్న వాటిల్లో అమెజాన్ అడవులు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇటీవల కార్చిచ్చు అడవిని దహనం చేస్తూ వస్తోంది. ఈ విషయంపై అందరం బాధ్యతగా ఆలోచించి పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సెలబ్రెటీలు అభిమానులకు పిలుపునిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు.
“ఈ వార్త చాలా కలతపెడుతోంది. ప్లానెట్‌కి ఊపిరితిత్తులని చెప్పబడే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 20% ఆక్సిజన్‌ని అందిస్తోంది. కానీ ఇప్పుడు అది అగ్ని ప్రమాదానికి గురైంది. ఇది అందరికి ఒక హెచ్చరిక. భూమి గురించి అందరు ఆలోచించాల్సిన సమయం ఇదే. కొంతలో కొంతైనా ప్రకృతి అభివృద్ధిలో బాగమవ్వాలని పచ్చదనం కోసం ఓ అడుగు ముందుకు వేయండని” మహేష్ పిలుపునిచ్చారు.
ఇక అమెజాన్ ఫారెస్ట్‌లో దాదాపు 475 వేల ఎకరాలు వరకు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో వన్య ప్రాణులు ఈ ప్రమాదంలో మరణించినట్లు సమాచారం.
తర్వాతి కథనం
