శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 17 ఆగస్టు 2019 (21:47 IST)

మ‌హేష్‌, బ‌న్నీ ఫ్యాన్స్‌కి భ‌య‌ప‌డిన నిర్మాత‌లు... ఇంత‌కీ ఏం చేసారు..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అన్న‌పూర్ణ స్టూడియోలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తుంది. 
 
ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే... బ‌న్నీ న‌టిస్తున్న తాజా చిత్రం అల‌...వైకుంఠ‌పురంలో.. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. 
 
ఇలా ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి మ‌హేష్‌, బ‌న్నీ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ స్టార్ట్ అయ్యింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ ఇద్ద‌రి హీరోల ఫ్యాన్స్ ర‌చ్చ‌ర‌చ్చ చేస్తున్నారు. 
 
ఈ వార్‌తో అలర్ట్ అయిన స‌రిలేరు నీకెవ్వ‌రు నిర్మాత‌లు, అల‌..వైకుంఠ‌పురంలో నిర్మాత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. అది ఏంటంటే... ఈ రెండు సినిమాల‌ను ఒకేరోజు రిలీజ్ చేయ‌కూడదు. ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా నాలుగు రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీంతో ఈ ఇద్ద‌రి ఫ్యాన్స్ మ‌ధ్య వార్ త‌గ్గుతుంది అనేది ఆయా చిత్ర నిర్మాత‌ల ఆలోచ‌న‌. మ‌రి... ఈ ప్లాన్ ఎంతవ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.