సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 17 ఆగస్టు 2019 (16:12 IST)

అవికా గోర్‌కి ఇప్పుడు అవన్నీ అర్థమవుతున్నాయట...

బాలికా వధు(చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్. ఆమె యాక్టింగ్ స్కిల్స్ గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. తనకు సెట్టయ్యే కథలను ఎంచుకుంటూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న అవికా గోర్ ఇటీవల తెలుగుపై తనకున్న ప్రేమను చాటుకుంది. 
 
రీసెంట్‌గా IANSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించిన అమ్మడు తెలుగు గురించి కూడా మాట్లాడింది. ‘నాకు తెలుగంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాల్లో నటించాను కాబట్టి అప్పుడే అర్ధం చేసుకోవడం స్టార్ట్ చేశాను. గతంలో చేసినట్లుగా తెలుగు కథలను నా కోసం హిందీలో ట్రాన్స్‌లేట్ చేయవలసిన అవసరం లేదు. 
 
స్క్రిప్ట్ తెలుగులో చెప్పినా అర్ధం చేసుకొనగలిగే అవగాహన వచ్చింది’ అని అవికా గోర్ వివరణ ఇచ్చింది. అలాగే ఫ్యూచర్‌లో తనకు సరిపోయే మంచి కథల వైపే మొగ్గు చూపుతాను అని తెలిపింది. తెలుగులో అవికా ఉయ్యాల జంపాల – సినిమా చూపిస్త మావ – ఎక్కడికి పోతావు వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.