శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (19:46 IST)

అబ్బే.. సినిమాలూ వద్దూ.. రాజకీయాలూ వద్దు.. పెళ్లే ముద్దు.. రమ్య (video)

అవును.. సినిమాలకు, రాజకీయాలకు సినీ నటి రమ్య గుడ్ బై చెప్పబోతుందట. హీరోయిన్ రమ్య కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో నటించింది. పలు చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే నటనతో కూడా మెప్పించింది. తెలుగులో నటించిన ఏకైక చిత్రం కళ్యాణ్ రామ్ 'అభిమన్యు'.  ఈ సినిమా ఆమెకు ఆశించినంత గుర్తింపును సంపాదించిపెట్టలేదు. 
 
ఇక కోలీవుడ్‌లో రమ్యకు మంచి పేరు వచ్చింది. సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో రమ్య హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రం తెలుగులో డబ్ అయింది. కన్నడ, తమిళ భాషల్లోనే రమ్య ఎక్కువగా నటించింది.
 
మరోవైపు రమ్య రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2013లో కర్ణాటకలోని మాండ్య ఉపఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుతం రమ్య కాంగ్రెస్ పార్టీలో నేతగా వున్నప్పటికీ, రాజకీయాల పట్ల విసుగు చెందినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె నటన, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
తన బాల్య స్నేహితుడి రఫెల్‌నే ఆమె వివాహం చేసుకోనుందని, ఆపై దుబాయ్‌లో సెటిల్ కానుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై రమ్య ఏమాత్రం నోరు మెదపలేదు.