సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని గతంలో పెద్దిరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంత గత 2016లో రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మియ్యలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి గత 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును రిజర్వు చేసి, తాజాగ తీర్పునిచ్చింది. ఈ ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారులు లేవని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.
ప్రియురాలు మాట్లాడలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ప్రియురాలు ఫోనులో మాట్లాడలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం రాజంపేట మండలం మన్నూరులో చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లి తాండాకు చెందిన జయపాల్ నాయక్ (19) ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట రాజంపేట మన్నూరులో ఉంటూ మోటార్లకు మరమ్మతులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అతనికి వజ్రకరూరుకు మండలానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నారు. అయితే, కొన్ని రోజులుగా ఆమె మాట్లాడట్లేదు. పలుమార్లు ఫోన్ చేసినా ఆమె వైపు నుంచి స్పంద లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, మన్నూరులో నివాసం ఉంటున్న ఓ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన మన్నూరు పోలీసులు శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.