శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2019 (16:22 IST)

అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు.. ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరి.. సెలెబ్రిటీస్ ట్వీట్స్

అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ తగలబడిపోతోంది. భూగోళానికి అధిక మొత్తంలో ప్రాణవాయువును (ఆక్సిజన్) అందించే అడవులు నిత్యం తగలబడిపోతుంటే పలువురు సెలెబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. డీప్ స్ట్రబింగ్ అంటూ హీరో మహేష్ బాబు ట్వీట్ చేస్తే... ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరి అంటూ మరో హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. 
 
భూగోళానికి అధిక మొత్తంలో ఆక్సిజన్ అందించే అడవులు బ్రెజిల్‌లో ఉన్నాయి. ఈ అడ‌వులు ప్ర‌తి ఏడాది రికార్డు స్థాయిలో తగలబడిపోతున్నాయి. ఆ దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు, శాస్త్ర‌వేత్త‌లు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు స్పందిస్తూ ఉన్నారు. ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి..! ఇప్ప‌టికైన మేల్కొని అమెజాన్‌ని కాపాడుకుందాం అంటూ పిలుపునిస్తున్నారు. 
 
ఈ వ్యవహారంపై తెలుగు చిత్రపరిశ్రమ నుంచి మ‌హేష్ బాబు తొలుత స్పందించారు. "ఈ వార్త చాలా భాదాక‌రమైన‌ది. 20 శాతం ఆక్సీజ‌న్‌ని అందించే అమెజాన్ అడవులు మంట‌ల‌లో కాలిపోతున్నాయి. ఇప్ప‌టికైన మేల్కొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ని కాపాడుకుందాం. జీవ వైవిధ్యం చాలా దెబ్బతింటుంది. మన భూమిని రక్షించుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. పచ్చని వాతావ‌ర‌ణం కోసం ఒక అడుగు ముందుకు వేయండి. అది మ‌న ఇంటి నుండి ప్రారంభద్దాం" అని మ‌హేష్ పిలుపునిచ్చారు. అలాగే, సాయిధరమ్ తేజ్, అనుష్క, అర్జున్ కపూర్, దిశా పఠానీ అనేక మంది ప్రముఖులు, నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.