''సరిలేరు నీకెవ్వరు'' Vs ''కమ్మ రాజ్యంలో కడప రెడ్లు''-(వీడియో)

Last Updated: ఆదివారం, 11 ఆగస్టు 2019 (14:21 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రాబోతున్నాడు. మోస్ట్ నాన్ కాంట్రవర్సియల్ మూవీ అంటూ ప్రకటించినప్పటికీ ఇందులో అంతా అదే ఉంది. ఏపీలో మారిన రాజకీయ ముఖచిత్రాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ నిర్మాత, బ్యానర్ ఏంటో తెలియదు కానీ సాంగ్ మాత్రం రిలీజ్ చేశాడు. చెప్పాల్సిందంతా అందులోనే చెప్పేశాడు. 
 
పనిలో పనిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశాడు. సూపర్ స్టార్స్ కంటే ప్రేక్షకులకు కులాభిమానమే ఎక్కువైంది. ఇది మంచి పరిణామం కాదని ట్వీట్ చేసాడు. అంతేగాకుండా మహేష్ బాబు నటించిన ''సరిలేరు నీకెవ్వరు'' ఇంట్రో సాంగ్‌ను తను తెరకెక్కిస్తోన్న ''కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'' సాంగ్‌ను సరిగ్గా టైమ్ చూసుకొని మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసాడు. 
 
వర్మ రిలీజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. దీనిపై  రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. తమ పాట గూగుల్ ట్రెండ్స్‌లో దూసుకుపోతుందని వ్యాఖ్యానించాడు. అంతేకాదు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు యాక్ట్  చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లోని ఇంట్రో సాంగ్ కంటే ఈ వీడియో పాటకే ఆదరణ లభించందని ట్వీట్ చేశాడు.దీనిపై మరింత చదవండి :