శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 29 మే 2019 (18:32 IST)

జగన్, 150 మంది ఎమ్మెల్యేలతో రామ్ గోపాల్ వర్మ శ్రీవారి దర్శనం

ఆర్‌జీవి ఫిలాసఫీలు ఫాలోయర్స్‌కు చాలా సమ్మగా ఉంటాయి. ఆయన చెప్పే లాజిక్కులు సైన్సు లాగా ఉంటాయి. అతని రీజనింగ్ మైండ్ ఫాలోయర్‌లను ఆకట్టుకుంటుంది. అయితే వర్మ నాస్తికుడా లేక ఆస్తికుడా అనే సందేహం చాలా మందిని జుట్టు పీక్కునేలా చేస్తుంది. చాలా మంది నాస్తికుడే అని కన్ఫర్మ్ చేసుకున్నా అతని తీరు మాత్రం కన్ఫ్యూజన్‌కి గురిచేస్తుంది. 
 
ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరీ సినిమా మొదలు పెట్టాడు. తన దైవం ఎన్టీఆర్‌కు ప్రియమైన దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి కాబట్టి పెద్దాయన నమ్మకాన్ని గౌరవించి శ్రీవారిని దర్శించుకున్నానని ఆ సమయంలో చెప్పాడు. దానర్థం వర్మ శ్రీవారిని నమ్మినట్లా లేక నమ్మనట్లా అని చాలా మంది సందేహం. 
 
ఇదిలా ఉండగా తాజాగా మరోసారి రామ్ గోపాల్ వర్మ శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి, 150 మంది వైసీపీ ఎంఎల్‌ఎలతో కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 
 
వైయస్ జగన్ గారిని, ఆయన ఆర్మీ 150 మంది ఎంఎల్ఎలను లార్డ్ బాలాజీ గర్భగుడిలో చూడడం సంతోషంగా ఉంది. జగన్ గారు ఎప్పటికీ సీఎంగా ఉండాలని ప్రార్థించి ఉంటారు. నేను కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు దీవెనల కోసం ప్రార్థించాను అని ట్వీట్ చేశాడు.