మ‌హేష్ బాబు కూతురు ఏం చేసిందో మీరే చూడండి...

Sitara
శ్రీ| Last Modified బుధవారం, 14 ఆగస్టు 2019 (20:00 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇటీవలి ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి సినిమాలోని సూపర్ హిట్ సాంగ్స్‌లో ఒకటైన ‘పాల పిట్ట’ సాంగ్‌కు, ఆయన కుమార్తె సితార డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. మహేష్ గారి సతీమణి నమ్రత గారు, సితార డ్యాన్సింగ్ వీడియోను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది.

గతంలో భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న సితార, తన తండ్రి సాంగ్‌కి సూపర్బ్‌గా డ్యాన్స్ చేసి అదరగొట్టిందనే చెప్పాలి. ఇక ఈ వీడియోను చూసిన వారందరూ ఆమె డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ, తండ్రి సూపర్ స్టార్ మహేష్ వలె సితారకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆమెపై పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోను పలు మీడియా మాధ్యమాల్లో షేర్స్ మరియు లైక్స్‌తో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :