శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (12:39 IST)

ప్రిన్స్ బర్త్‌డే.. నువ్వెళ్లే రహదారికి జోహారు.. 'సరిలేకు నీకెవ్వరు' బ్యాగ్రౌండ్ బిట్ సాంగ్ వీడియో

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆయన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం బ్యాగ్రౌండ్ సాంగ్ బిట్‌ను రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
అయితే, హీరో పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్‌ను ది ఇంట్రో పేరుతో శుక్రవారం విడుదల చేశారు. మేజర్‌ అజయ్‌ కృష్ణ రిపోర్టింగ్‌ అంటూ చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. ఆర్మీ మేయర్‌ లుక్‌లో మహేశ్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. 'సరిలేరు నీకెవ్వరు.. నువ్వేళ్లే రహదారికి జోహర్లు, ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు' అంటూ సాగే బ్యాగ్రౌండ్‌ బిట్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. 
 
ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్నా నటిస్తుంటే ప్రముఖ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రను పోషిస్తోంది. ఈమె ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌ బాబులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ప్రిన్స్ బర్త్‌డేని పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన నటుడికి శుభాకాంక్షల వెల్లువ సాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు కూడా మహేష్‌కు విషెస్‌ అందజేశారు. హరీశ్‌ శంకర్‌, రామజోగయ్య శాస్త్రి, మెహర్‌ రమేశ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సుషాంత్‌, శ్రీను వైట్ల, దేవీ శ్రీ ప్రసాద్‌, కోన వెంకట్‌, సంపత్‌ నంది, సీనియర్‌ నరేశ్‌, ఈషా రెబ్బా, అనిల్‌ సుంకర, వెన్నెల కిశోర్‌, అనిల్‌ రావిపూడి సూపర్‌ స్టార్‌కు ట్విటర్‌ వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలిపారు. అలాగే సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అల్‌ ది బెస్ట్‌ చెప్పారు.