సంబంధిత వార్తలు
- ఆ అవార్డ్ రావడం ఎంతో సంతోషంగా ఉంది: మహేష్ బాబు
- ఒకే వేదికపై కనువిందు చేయనున్న పవన్, మహేష్.. ఎప్పుడు.. ఎక్కడ..?
- ఎవరు చిత్రంపై కామెంట్ చేసిన సూపర్ స్టార్... ఇంతకీ ఏమన్నారు..?
- అందరూ ఆలోచించాల్సిన సమయం ఇదే - మహేష్ బాబు
- అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు.. ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరి.. సెలెబ్రిటీస్ ట్వీట్స్
అలా... జరుగుతుంది అనుకోలేదు - మురళీశర్మ
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం బిజీగా ఉన్నవారిలో మురళి శర్మ ఒకరు. తనదైన శైలిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్‌తో మెప్పించే ఈ యాక్టర్ అతిథి సినిమా నుంచి భాషా భేదం లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైన తెగ మెరుస్తున్నారు. అయితే తన కెరీర్ మొదట్లోనే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదని మురళి శర్మ వివరించారు.
అతిథి సినిమాలో నటిస్తున్నాను అని తెలియగానే మా అమ్మ, కృష్ణ గారి అబ్బాయి సినిమాలో మా అబ్బాయి నటిస్తున్నాడు అని అందరికి ఎంతో ఆనందంగా చెప్పుకున్నారని ఆ జ్ఞాపకాన్నీ తానెప్పటికీ మరచిపోలేనని తెలిపారు. ఇక ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నట్లు చెబుతూ.. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’, శర్వానంద్ కొత్త సినిమాతో అలాగే మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు మురళీశర్మ తెలియజేశారు.
తర్వాతి కథనం
