శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మనీల
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (11:19 IST)

హ్యాట్రిక్ హిట్ కొట్టేస్తానంటోన్న: మహేశ్ బాబు

భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలతో ఘన విజయం సాధించిన మహేష్ బాబు...ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నారు. 
 
మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అజయ్ కృష్ణ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మహేశ్ బాబు నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన మహేశ్ బాబు, త్వరలో తదుపరి షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నాడు.
 
అంతేకాదు ఈ సినిమా కథా కథనాలు చాలా కొత్తగా ఉంటాయనీ, తన అభిమానులకు పూర్తి వినోదాన్ని అందిస్తాయని సన్నిహితులతో చెబుతున్నాడట. ఈ సినిమాలో తను చాలా కొత్తగా కనిపిస్తాననీ, ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాడట. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.