రీ-ఎంట్రీతో ఫుల్ బిజీ అయిన రాముల‌మ్మ..‌

Mahesh-Ramulamma
శ్రీ| Last Modified శనివారం, 28 సెప్టెంబరు 2019 (22:25 IST)
రాముల‌మ్మ.. అదేనండి సీనియ‌ర్ హీరోయిన్ విజ‌య‌శాంతి గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూర‌మైంది. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో విజ‌య‌శాంతి కీలకపాత్ర పోషిస్తుంది. విజయశాంతిపై దాదాపు అన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఆమె షూటింగ్‌లో ఉండగానే కొంతమంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సంప్ర‌దించి త‌మ సినిమాలో న‌టించాల‌ని అడిగార‌ట‌.

అంతేకాదండోయ్... మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమాలో సైతం నటించాలని కోరారట. చిరు మూవీ కావ‌డంతో సెకండ్ థాట్ లేకుండా వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌.

అలాగే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్3 లో న‌టించాల‌ని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి అడుగ‌గా... విజ‌య‌శాంతి అనిల్ రావిపూడి వ‌ర్క్ న‌చ్చి చేస్తాన‌ని మాట ఇచ్చింద‌ట‌. విజ‌య‌శాంతి.. చిరు - కొర‌టాల‌ మూవీ, ఎఫ్ 3 ఈ సినిమాల్లో న‌టిస్తే.. ఈ సినిమాల‌కు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.దీనిపై మరింత చదవండి :