మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు ఓవర్సీస్ రైట్స్ ద‌క్కించుకుంది ఎవ‌రో తెలుసా..?

శ్రీ| Last Modified శనివారం, 12 అక్టోబరు 2019 (14:27 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. చాలా రోజుల తరువాత మహేష్ నుంచి వస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఓవర్సీస్‌లో మహేష్ మార్కెట్ ఏ రేంజ్‌లో ఉందో స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఓవర్సీస్‌లో పోటీపడి ప్రముఖ గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ మరోసారి మహేష్ సినిమా హక్కుల్ని దక్కించుకుంది.


గతంలో యూఎస్ఎలో అతడు, పోకిరి, భరత్ అనే నేను, అలాగే మహర్షి వంటి హిట్ సినిమాలను భారీ స్థాయిలో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ సంస్థ మళ్ళీ ఇప్పుడు సరిలేరు నికెవ్వరు హక్కుల్ని దక్కించుకుంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ని పూర్తి చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. SVC ప్రొడక్షన్, GMB ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేష్ బాబుతో రష్మిక మందన హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మాజీ వంటి సీనియర్ యాక్టర్స్ కూడా సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.దీనిపై మరింత చదవండి :