శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (13:24 IST)

#JioFiberPlans ఆ దేవుడికే తెలుసు... నెటిజన్స్ సెటైర్స్... మీరేమంటారు?

జియో ఫైబర్ ప్లాన్స్ ప్రవేశపెట్టకముందు తామంతా #JioFiberPlans వస్తే ఇక మిగిలిన నెట్వర్కులన్నింటి ముందు జియో బాహుబలిలా నిలుస్తుందని అనుకున్నామనీ, కానీ తాము అనుకున్నంత స్థాయిలో లేదని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అసలు టీవీ, డీటీహెచ్ సౌకర్యాలు లేకుండా జియో ఫైబర్ నెట్వర్కుతో ఏం చేయాలంటూ సెటైర్లు వేస్తున్నారు.
 
జియో ఫైబర్ కంటే చంద్రబాబు హయాంలో ఏపీ సర్కార్ కల్పించిన APSFL ఎంతో నయం అంటూ ఆ టారిఫ్‌లను జోడిస్తున్నారు. జియో ఫైబర్ ప్లాన్లను చూసిన తర్వాత తామంతా అప్సెట్ అయినట్లు పేర్కొంటున్నారు. ఇతర నెట్వర్కుల కంటే జియో ఫైబర్ పెద్దగా ఇచ్చేది ఏమీ కనబడటం లేదని ట్వీట్లు చేస్తున్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారు?