దేవుడా.. ఇమ్రాన్‌ను మాకు హిస్టరీ లెక్చరర్ చేయనుందుకు థ్యాంక్స్ : ఆనంద్ మహీంద్రా సెటైర్లు
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై భారత పారిశ్రామికదిగ్గజం ఆనంద్ మహీంద్రా సెటైర్ వేశారు. దేవుడా... ఇమ్రాన్‌ను మాకు హిస్టరీ లెక్చరర్ చేయనందుకు థ్యాంక్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజానికి ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఏదో ఒక అంశంపై తనదైనశైలిలో స్పందిస్తుంటారు. తాజాగా, ఇమ్రాన్ ఖాన్ అంశంపై స్పందించారు. ఇంతకీ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసుకుందాం.
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. అపుడు ఆయన చెప్పిన ఓ మాటకు తాజాగా ఆనంద్ సెటైర్ జోడించి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ పర్యటనలో ఇమ్రాన్ 'సరిహద్దు పంచుకుంటున్న జర్మనీ, జపాన్‌లు రెండో ప్రపంచ యుద్ధం అనంతరం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి' అని వ్యాఖ్యానించారు.
నిజానికి జర్మనీ - జపాన్ దేశాలు ఇండో-పాకిస్థాన్ తరహాలో ఒకే సరిహద్దును పంచుకోవడం లేదు. ఎందుకంటే.. జపాన్ ఆసియాలో ఉంటే, జర్మనీ యూరప్‌లో ఉంది. ఈ రెండు దేశాలకు కొన్ని వేల మైళ్ళ దూరం ఉంది. దీనిపై ఆనంద్ మహీంద్రా ఇపుడు సెటైర్ వేశారు.
'దేవుడా... ఆయనను (ఇమ్రాన్) మాకు హిస్టరీ లెక్చరర్ చేయనందుకు నీకు ధన్యవాదాలు' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి నవ్వులు పూయిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఆర్టికల్ 370 రద్దుపై తన వాచాలత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో గతంలో ఆయన చేసిన మాటలను గుర్తు చేసి ఆనంద్ ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశారు.