సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (17:54 IST)

యూట్యూబ్‌ను ఓ ఊపు ఊపుతున్న 'రాములో రాములా' సాంగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అలా.. వైకుంఠపురములో. ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా, అపుడపుడూ ఒక్కో పాటల ఆడియోను రిలీజ్ చేస్తున్నారు. 
 
తాజాగా రాములో రాములా నన్నాగమ్ చేసిందిరో అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన ఫుల్ సాంగ్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. కాసర్ల శ్యామ్ ర‌చించిన ఈ గీతాన్ని అనురాగ్ కుల‌క‌ర్ణి, మంగ్లీ ఆల‌పించారు. ఎస్.థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. 
 
ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. గ‌తంలో ఈ చిత్రం నుండి విడుద‌లైన 'సామజవరగమన' పాట సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట కూడా విడుదలైన కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో మొదటిస్థానంలో ఉంది. 
 
ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.