యూట్యూబ్‌ను ఆగమాగంచేస్తున్న #AlaVaikunthapurramuloo రాములో రాములా సాంగ్

ala vaikuntapuram lo
ఠాగూర్| Last Updated: మంగళవారం, 22 అక్టోబరు 2019 (19:46 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్న - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అలా.. వైకుంఠపురములో..." వచ్చే యేడాది సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకురానుంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో ఓ సంచలనమే సృష్టించింది. ఇపుడు మరో సాంగ్ టీజర్‌ను వదిలారు. "రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో .. రాములో రాములా నా పాణం దీసిందిరో" అంటూ ఈ పాట సాగుతోంది. క్లాస్ సెట్లో మాస్ బీట్‌తో సాగే ఈ పాటను బన్నీ.. పూజా హెగ్డే బృందంపై చిత్రీకరించారు.

తమన్ స్వరపరిచిన బాణీ బాగుంది. మాస్ ఆడియన్స్‌కి ఈ బీట్ మంచి ఊపును.. ఉత్సాహాన్ని తెచ్చేదిలా వుంది. కొరియోగ్రఫీ కూడా బాగుందనే విషయం ఈ చిన్న బిట్‌ను బట్టే తెలుస్తోంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో బన్నీ కొత్తగా కనిపిస్తున్నాడు. పూర్తి పాటను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు.

కాగా, ఈ సాంగ్‌ను మంగళవారం విడుదల చేయగా, ఇప్పటికే దాదాపు ఐదు లక్షల మంది నెటిజన్లు వీక్షించగా, 102 వేల మంది లైక్ చేశారు. 6.7 వేల మంది డిజ్‌లైక్ చేశారు. మొత్తమీద సామజవరగమన సాంగ్‌తో పాటు.. "రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో .. రాములో రాములా నా పాణం దీసిందిరో" పాట కూడా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి.
దీనిపై మరింత చదవండి :