1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Allu Sirish Birth Day celebrations

అల్లు శిరీష్ బర్త్ డే వేడుకలు, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో కేక్ కట్

Allu Sirish
లాక్ డౌన్ నేపధ్యంలో సెలబ్రిటీల పుట్టినరోజు వేడుకల కూడా సాదాసీదాగా చేసేసుకుంటున్నారు. ఈ రోజు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ బర్త్ డే. ఈ మే 30వ తేదీతో శిరీష్ 33వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కుటుంబం అంతా కలిసి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
 
ఈ వేడుకకు అల్లు బాబీ, అల్లు అర్జున్ దంపతులతో పాటు వారి పిల్లలు కూడా హాజరయ్యారు. కాగా మరిది శిరీష్ కోసం అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇంట్లోనే స్పెషల్ కేక్ తయారు చేశారు.
తర్వాతి కథనం
మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. అర్థం చేసుకోండ్రా.. ప్లీజ్.. తమ్మారెడ్డి