1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. David warner TikTok for Allu Arjun's Ramulo Ramula song

బన్నీకి పోటీగా డేవిడ్ వార్నర్.. స్టెప్పులతో ఇరగదీస్తున్న క్రికెటర్

David Warner
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్. కరోనా లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై తన భార్య, పిల్లలతో ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పనిలోపనిగా ఈ క్రికెటర్ మనసు తెలుగు పాటలపై పడింది. ముఖ్యంగా, అల్లు  అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ "అల.. వైకుంఠపురములో" చిత్రంలోని పాటలపై మనసుపారేసుకున్నాడు. ఇంకేముంది.. అచ్చం.. స్టైలిష్ స్టార్ తరహాలోనే డ్యాన్సులు చేస్తూ, వాటిని టిక్‌టాక్‌ యాప్‌లో షేర్ చేస్తుండటంతో అవి వైరల్ అవుతున్నాయి. పైగా, ఈ వీడియోలను చూసిన సినీ సెలెబ్రిటీస్ ఫిదా అయిపోతున్నారు. 
 
మొన్నటికిమొన్న బుట్టబొమ్మ పాటకు నృత్యం చేసిన డేవిడ్ వార్నర్.. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "పోకిరి"లో హిట్ డైలాగ్ చెప్పి మరింత విస్మయానికి గురిచేశాడు. ఇప్పుడు రాములో రాములా పాటకు తన కుటుంబ సభ్యులతో కలిసి వార్నర్ టిక్ టాక్‌లో మరో వీడియో చేశాడు. 
 
తన భార్యతో కలిసి వార్నర్ హుషారుగా స్టెప్పులేస్తుండగా, కూతురు కూడా హుషారుగా కాలు కదిపింది. ఏదేమైనా వార్నర్ చూపు అల్లు అర్జున్ పాటలు, స్టెప్పులపై పడిందనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు వార్నర్ చేసిన పాటలు బన్నీ నటించిన "అల.. వైకుంఠపురములో" చిత్రంలోనివే కావడం విశేషం.

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ధోనీకి కూడా కోపం వస్తుంది.. వచ్చిందంటే భయంకరంగా వుంటుంది..