సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (15:51 IST)

''పుష్ప'' కోసం పక్కా లోకల్ అంటోన్న అల్లు అర్జున్.. లుక్ అదుర్స్

Pushpa
అల వైకుంఠపురంలో సినిమాకు తర్వాత మరో బంపర్ హిట్ కొట్టేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిద్ధం అవుతున్నాడు. కలెక్షన్ల పరంగా అల వైకుంఠపురంలో కుమ్మేసింది. పాటలు కూడా హిట్ అయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో తదుపరి సినిమాతో అల్లు అర్జున్ బిజీ అయ్యాడు. వైవిధ్యభరితమైన కథను ఎంచుకుని ప్రేక్షకుల మందుకు రానున్నాడు. తాజాగా అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. 
 
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌తో కలిసి ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సహజత్వానికి అత్యంత దగ్గరగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లోకల్ టెక్నీషియన్‌లతో తెరకెక్కించబోతున్నారు.
 
ఈ సినిమా నూటికి నూరు శాతం మేకిన్ ఇండియా ప్రాజెక్టుగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్ర మరితం ప్రభావవంతంగా వుంటుందట. అతని పరిచయ సన్నివేశాల కోసం దాదాపు 6 కోట్లని చిత్ర బృందం ఖర్చు చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. 
 
పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రాబోతున్న ఈ చిత్రంలో ఊరమాస్ పాత్రలో లారీడ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో స్టైలిష్ స్టార్ కనిపించబోతున్నారు. పంచెకట్టు.. నో మేకప్.. పక్కా లోకల్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. 
 
తాజాగా సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అల్లు అర్జున్ షేర్ చేసిన స్టిల్ చూస్తే సినిమా ఎలావుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకేముంది..? అల్లు అర్జున్ లేటెస్టు పుష్ప లుక్ ఎలా వుందో ఓసారి చూద్దామా..!?