బన్నీ పుష్పలో హీరోయిన్‌ని మార్చేస్తున్నారా?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. టైటిల్‌కి సోషల్ మీడియాలో రెస్పాన్స్ బాగానే వచ్చినా.. కొంతమంది మాత్రం టైటిల్ ఏంటి ఇలా ఉంది..? అనే అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఏది ఏమైనా ఆర్య ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ - సుక్కు కలిసి చేస్తున్న సినిమా కావడంతో పుష్ప సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఇందులో కథానాయికను మార్చేస్తున్నారని. అదేంటి.. రష్మిక ఇంకా సెట్స్‌లో రాలేదు. ఆమెపై ఒక్క సీన్ కూడా ఇంకా తీయలేదు. ఇంతలో ఏమైందని. హీరోయిన్ మార్చేయడానికి అని ఆరా తీస్తే..? తెలిసింది ఏంటంటే... రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకోవడం లేదని తెలిసింది.
మరి.. ఈ వార్త ఏంటి అంటే.. మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందని తెలిసింది. ఆ పాత్ర కోసం మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్‌ని కాంటాక్ట్ చేసారని టాక్ వినిపిస్తోంది.
దర్బార్ సినిమాలో రజనీకాంత్ కూతురుగా నటించినప్పటి నుంచి నివేదా థామస్‌కి ఇటు టాలీవుడ్‌లోను అటు కోలీవుడ్‌లోను మంచి క్రేజ్ వచ్చింది. రీసెంట్‌గా నాని వి సినిమాలో నటించింది. బన్నీ పుష్పలో నటించే ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.