మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (11:29 IST)

"రుధిరం - రణం - రౌద్రం" నుంచి ఓ తాజా వార్త.. ఏంటది?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "రుధిరం - రౌద్రం - రణం" (ఆర్ఆర్ఆర్). మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఇందులో టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తుండగా, ఇప్పటికే 75 శాతం మేరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. 
 
అయితే, ఈ చిత్రంలో హీరోయిన్ల ఎంపికే ఓ ప్రహసనంగా మారింది. ఆరంభంలో చెర్రీ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ఎన్టీఆర్ యూకేకు చెందిన నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేశారు. అయితే, జోన్స్ తన వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకున్నారు. దీంతో ఆమె స్థానంలో ఒలీవియాను ఎంపిక చేశారు. 
 
అయితే, ఈ చిత్రం షూటింగ్ 75 శాతం ముగిసినప్పటికీ... హీరోలు, హీరోయిన్లపై చిత్రీకరించాల్సిన కొన్ని సీన్లు మాత్రం మిగిలివున్నాయట. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో ఒలీవియా మోరిస్ ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.
 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్‌ను పూర్తిస్థాయిలో ఇప్పట్లో ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదు. ఒలీవియా లండన్ ఆర్టిస్ట్ .. అందువల్ల ఆమెకి ఇక్కడికి వచ్చే అవకాశాలు తక్కువనే అంటున్నారు. 
 
అలియా భట్ ముంబై కనుక, ఆమె వలన పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. ఇప్పటికే షూటింగు ఆలస్యమైంది. కనుక, లాక్‌డౌన్ కారణంగా ఒలీవియా లండన్ నుంచి రాలేని పరిస్థితులు వుంటే, ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదనే ఒక టాక్ వినిపిస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సివుంది.