సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (11:18 IST)

''పుష్ప''లో నివేదా పేతురాజ్.. రష్మికకు పోటీనా?

అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌కి అవకాశం వుందట. అంతేకాదు.. ఆ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్ర కోసం నివేదా పేతురాజ్ తీసుకున్నారని తెలుస్తోంది. బన్నీ అల.. వైకుంఠపురములో సినిమాలో కూడా నివేదా పేతురాజ్ నటించింది. 
 
తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం పుష్పలో కూడా ఆమెదే రెండో స్థానం. ఇంకా రష్మికకు ధీటుగా ఆమె రోల్ వుంటుందని.. గ్లామర్ పరంగా అదరగొట్టేస్తుందని సమాచారం. ఇకపోతే.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కనుంది. ఇందులో బన్నీ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్. చిత్తూరు జిల్లా నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడతారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ పుష్పలో మెరవనున్నట్టు సమాచారం.