శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 13 ఏప్రియల్ 2020 (20:08 IST)

మహేష్ బాబుకి చెప్పిన కథ, బన్నీతో చేస్తున్న పుష్ప కథ ఒకటేనా?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో 1 నేనొక్కడినే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా మహేష్‌ బాబుకు నటనపరంగా మంచి పేరు వచ్చింది కానీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం విజయం సాధించలేదు. దీంతో సుకుమార్ మహేష్‌ బాబుతో ఈసారి మాంచి సినిమా చేసి సక్సస్ సాధించాలనుకున్నారు. 
 
ఈ విషయాన్ని స్వయంగా సుకుమార్ చాలాసార్లు చెప్పారు. మహేష్ కూడా సుకుమార్‌తో మరోసారి వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించారు. అయితే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సుకుమార్ రంగస్థలం సినిమా తెరకెక్కించి.. బ్లాక్ బస్టర్ సాధించడం తెలిసిందే. ఈ మూవీ తర్వాత సుకుమార్‌కి మహేష్‌ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.
 
మహేష్‌ బాబు కోసం రెడీ చేసిన స్టోరీ లైన్ చెప్పడం.. స్టోరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్టోరీ రెడీ చేయమని మహేష్ చెప్పడం జరిగింది. దీంతో మహేష్‌ -సుకుమార్ కాంబినేషన్లో మూవీ కన్ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే... మహేష్‌‌కి సుకుమార్ ఫుల్ స్టోరీ నెరేట్ చేసిన తర్వాత అందులో కొన్ని మార్పులు చేయాలని మహేష్‌ చెప్పారు. ఆ తర్వాత సుకుమార్ మహేష్ చెప్పినట్టుగా మార్పులు చేసి రెండుమూడు సార్లు ఫుల్ నెరేషన్ ఇచ్చినా.. మహేష్ బాబుకి కథ పూర్తిగా సంతృప్తి కలిగించలేదు. దీంతో మహేష్.. కథ ఓకే చేయడం లేదు. మార్పులు చెబుతూనే ఉండటంతో సుకుమార్... ఇక లాభం లేదనుకుని బన్నీకి కథ చెప్పి ఓకే చేయించుకున్నారు.
 
ఇదిలా ఉంటే... బన్నీ పుట్టినరోజు సందర్భంగా బన్నీ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్నచిత్రానికి పుష్ప అనే టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఇందులో అల్లు అర్జున్ లుక్ ఊర మాస్ అనేలా ఉంది. డిఫరెంట్‌గా ఉన్న ఈ పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మహేష్ -సుకుమార్ ప్రాజెక్ట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ.. విషయం ఏంటంటే... సుకుమార్.. మహేష్‌కి చెప్పిన కథనే బన్నీకి చెప్పాడా..? లేక బన్నీ కోసం మరో కథ రెడీ చేసి ఆ కథను చెప్పాడా..? అనేది ఆసక్తిగా మారింది.
 
కొంత మంది మాత్రం మహేష్‌ బాబుకి చెప్పింది వేరే కథ. బన్నీతో సినిమా చేస్తుంది వేరే కథ అని అంటున్నారు. అయితే.. మహేష్‌ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్టును మహేష్‌ ఎందుకు ఒప్పుకోలేదా అనుకున్నాం. మహేష్‌ తీసుకున్న నిర్ణయం సరైనదేననే అభిప్రాయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే.. మహేష్ బాబుకి చెప్పిన కథ బన్నీకి చెప్పిన కథ ఒకటే అని... మహేష్ బాబుకి ఇంత మొరటు లుక్ సెట్ కాదనీ, అలాగే పుష్ప అనే టైటిల్ కూడా ఆయనకి సెట్ కాదని అంటున్నారు. మరి.. మహేష్ బాబుకి చెప్పిన కథ, బన్నీతో చేస్తున్న పుష్ప ఒకటా కాదా అనేది తెలియాలంటే సుకుమార్ చెప్పాల్సిందే..!