శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (20:41 IST)

'పుష్ప' ఫస్ట్ లుక్‌ : అల్లు అర్జున్‌కు ఆరో వేలు .. పిక్ వైరల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కాలికి ఆరో వేలు ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ కొత్త చిత్రం ఫస్ట్‌ లుక్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఫస్ట్‌ను అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ ఎడమ కాలికి ఆరు వేళ్లు కనిపిస్తున్నాయి.
 
అయితే, ఇది ఈ కొత్త చిత్రం కోసం దర్శకుడు సుకుమార్ సృష్టించారా లేక బ‌న్నీకి ఆర‌వ వేలు ఉందా అనే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో హాట్ హాట్‌గా న‌డుస్తూ వ‌స్తుంది. బ‌న్నీ స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలిసిన విష‌యం ఏమంటే ఆయ‌న‌కి నిజంగానే ఆర‌వ వేలు ఉంద‌ట‌. సాధార‌ణంగా చేతికి లేదా కాలుకి ఆర‌వ వేలు ఉంటే అదృష్టంగా భావిస్తారు. 
 
ఆర‌వ వేలు ఉన్న‌ బన్నీ ఎంత అదృష్టవంతుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఆరవ వేలు ఉంటుంది. ఆయ‌న కూడా సూప‌ర్ స్టార్‌గా బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగున్న విష‌యం తెలిసిందే. ఇపుడు అల్లు అర్జున్ కూడా ఇటు టాలీవుడ్‌లో అగ్రహీరోగా ఉంటే అటు మలయాళ ఇండస్ట్రీలోనూ మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.