శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (10:16 IST)

'బంటు' మాయలో పడిన బాలీవుడ్ భామ

అల్లు అర్జున్ నటించిన చిత్రం "అల.. వైకుంఠపురములో". త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించగా, నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబులు నిర్మించారు. 
 
అయితే, ఈ చిత్రంలోని ప్రతి పాటా సూపర్ హిట్టే. ముఖ్యంగా, 'సామజవరగమన', 'రాములో రాముల' పాటలు చిత్రం విడుదలకు ముందే హెద్ద హిట్. చిత్రం విడుదలైన తర్వాత 'బుట్టబొమ్మ' సాంగ్ అదిరిపోయింది. ఇది సోషల్ మీడియాలో ఓ ట్రెండ్‌ను సృష్టించిది. ఈ పాటకు అల్లు అర్జున్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. 
 
అందుకే సోష‌ల్ మీడియాలో ప‌లువురు ఈ పాట‌కు డాన్స్ చేసి పోస్ట్ చేయ‌డం విశేషం. శిల్పాశెట్టి వంటి బాలీవుడ్ తార కూడా ఈ పాట‌కు డాన్స్ చేయ‌డం అప్ప‌ట్లో సెన్సేష‌న్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ భామ దిశా ప‌టానీ కూడా బుట్ట బొమ్మ‌లో పాట‌కు ఫ్యాన్ అయ్యింది. 
 
ఈ పాటలో వాలు ఉప‌రిత‌లంపై జారుతూ బ‌న్నీ వేసే స్టెప్‌ను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ 'అల్లు అర్జున్ ఇదెలా చేశావు' అని కామెంట్ పెట్టింది. దానికి అల్లు అర్జున్ స్పందింస్తూ "నేను మ్యూజిక్‌ను ప్రేమిస్తాను. మంచి మ్యూజిక్ నాతో డాన్స్ చేయిస్తుంది. మీ ప్ర‌శంస‌ల‌కు థాంక్స్" అంటూ బదిలిచ్చాడు.