బన్నీ న్యూలుక్ - ఫ్యాన్స్ ఫిదా - టెన్షన్లో సుక్కు..!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. బన్నీ - సుక్కు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పచ్చు.
ఇదిలా ఉంటే.. సుకుమార్ సినిమా అనగానే అందులో హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అతని గెటప్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆర్య సినిమా దగ్గర నుంచి రంగస్థలం సినిమా వరకు సుకుమార్ సినిమాలను పరిశీలిస్తే.. హీరో క్యారెక్టర్, గెటప్ చాలా కొత్తగా ఉంటాయనే విషయం తెలుస్తుంది. ఆర్య, ఆర్య 2 సినిమాల్లో బన్నీని కొత్తగా చూపించిన సుకుమార్.. ఈ సినిమాలో ఎలా చూపించనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ.. ఈ విషయం పై క్లారిటీ లేదు.
అయితే.. ఈ సినిమాలో బన్నీ గెడ్డంతో కనిపించనున్నాడు అని గత కొన్ని రోజులు నుంచి టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా బన్నీ గెడ్డంతో ఉన్న స్టిల్ బయటకు రావడంతో సుకుమార్‌తో చేస్తున్న సినిమాలో లుక్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బన్నీ తన వ్యక్తిగత బాడీగార్డ్ పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనగా ఆయన లుక్ బయటికి వచ్చింది. బన్నీ బాగా పెరిగిన జుట్టు మరియు గెడ్డంతో కొత్తగా కనిపించారు.
రంగస్థలంలో రామ్ చరణ్ మాదిరి, జులపాలతో బన్నీని డీగ్లామర్ రోల్‌లో చూపించనున్నాడని అర్థం అవుతుంది. బన్నీ న్యూలుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు కానీ.. లుక్ బయటకు వచ్చేసిందని సుకుమార్ టెన్షన్ పడుతున్నారని తెలిసింది.
బన్నీ ఇందులో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. తాజా షెడ్యూల్‌ను కేరళలో ప్లాన్ చేసారు. అయితే.. కొన్ని కారణాల వలన ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేసారు.
మార్చి 20 నుంచి రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్లాన్ చేసారు. ఈ సినిమాలో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. బన్నీ 20వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలీటీతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ భారీ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.