శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (10:29 IST)

నుదుట ఎర్రబొట్టు.. తీక్షణంగా చూస్తున్న పవన్ - పిక్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "వకీల్ సాబ్". ఈ చిత్రం వచ్చే మే నెల 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఈ లిరికల్ సాంగ్‌ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. కొన్ని గంటల్లో లక్షల వ్యూస్‌ను రాబట్టింది. 
 
'వకీల్ సాబ్' చిత్రం బాలీవుడ్ చిత్రం "పింక్‌"కు రిమేక్. అదేసమయంలో పవన కళ్యాణ్ మరో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో నటిస్తున్నారు. క్రిష్ తెర‌కెక్కిస్తున్న మూవీ ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్లింది. క్రిష్ - ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ మూవీ పీరియాడిక‌ల్ డ్రామా అని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు రాబిన్ హుడ్ త‌ర‌హాలో ఉంటుంద‌ని చెప్పుకొస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ఓ లుక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో ప‌వ‌న్ నుదుటిన పొడ‌వాటి ఎర్ర‌బొట్టు పెట్టుకొని తీక్ష‌ణంగా చూస్తున్నారు. ఈ ఫోటో చూస్తుంటే మాత్రం క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పీరియాడిక్ డ్రామాగానే అర్ధ‌మ‌వుతుంద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. ఇందులో క‌థానాయిక ఎవ‌రు, చిత్ర రిలీజ్ ఎప్పుడు త‌దిత‌ర వివ‌రాల‌ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.